ఏపీలో రాజకీయాల్లో పొత్తులు ప్రారంభం అవుతున్నాయా? ఎన్నికలకు ఇంకా రెండేళ్ళకు పైగానే సమయం వుంది. అయినా 2014 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయేమో అనిపిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సింహాన్ని ఎదుర్కొనేందుకు ఎన్ని జంతువులు ఏకమైనా ఏం చేయలేవు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయన్నారు.
అమరావతి రాజధాని అంశాన్ని ప్రచారం కల్పిస్తూ రాజకీయ లబ్దికోసం ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని తాము మార్చడం లేదు. వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయటం తమలక్ష్యం. ఇతర జిల్లాలతో పోల్చిచూస్తే శ్రీకాకుళం జిల్లా ఎంతగానో వెనకబడింది. విశాఖ రాజధానిగా వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుందన్నారు. రాష్ర్టం అంటే కేవలం ఒక ప్రాంతం అభివృద్ది చెందటం కాదు. అన్ని ప్రాంతాలను ఏకకాలంలో ప్రగతి పథంలో నడిపించడం అంటున్నారు ధర్మాన. బీజేపీ విమర్శలపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ మళ్ళీ కలిసి పోటీచేస్తాయనే సంకేతాలు వస్తున్నాయని, ఎంతమంది వచ్చినా వైసీపీని ఏం చేయలేవంటున్నారు వైసీపీ నేతలు.