Site icon NTV Telugu

తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన అప్పుడే…

తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన 2026 జనాభాలెక్కల తర్వాతనే అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రస్తుత 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225 స్థానాలకు, తెలంగాణ లోని ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలను 153 స్థానాలకు పెంచాలని సూచించింది ఏపీ పునర్విభజన చట్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 లో నిర్వహించే జనాభా లెక్కల పూర్తి అయున తర్వాతనే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నకు… కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Exit mobile version