NTV Telugu Site icon

Delhi excise case: సిసోడియాకు ఎదురుదెబ్బ… బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Manish Sisodia

Manish Sisodia

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణను రోస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 5న వాయిదా వేసింది. మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని మనీలాండరింగ్ కేసులోమనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణను రోస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.
Also Read:Jacqueline Fernandez: బేబీ నిన్ను మిస్సవుతున్నా.. జైలు నుంచి సుఖేష్ ప్రేమలేఖ

బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన వాదనలను కోర్టులో వినిపించింది. ఈ కేసును విచారణను ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఏప్రిల్ 5కి వాయిదా వేశారు. ఎక్సైజ్ కేసుకు సంబంధించిన ఈడీ కేసులో సిసోడియా ప్రస్తుతం ఏప్రిల్ 5 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ పిటిషన్ పై ఈడీ స్పందన తాము తెలుసుకోవాలని అనుంటున్నామని సిసోడియా తరపు న్యాయవాది తెలిపారు. ఇందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 5కు వాయిదా వేసింది.
Also Read:Julakanti Ranga Reddy: బీజేపీని తెలంగాణాలో అడుగు పెట్టనీయకుండా చేయాలి

అంతకుముందు ఈడీ తరపున హాజరైన న్యాయవాదులు జోహైబ్ హొస్సేన్.. మెయిల్ డేటా, మొబైల్ డేటా అన్నింటినీ ఫోరెన్సికల్‌గా విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. సిసోడియా చాలా కాలంగా ఉపయోగించిన మొబైల్ ఫోన్ ను సిబిఐకి ఎల్‌జి లేఖ రాసిన రోజే మార్చారని పేర్కొంది.
Also Read:TCS New CEO Krithivasan: టీసీఎస్‌ CEOగా సరైనోడే. కృతివాసన్‌పై అందరిదీ ఇదే మాట

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో మార్చి9న మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయంటూ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. 12 రోజుల పాటు కస్టడీలో మనీశ్ సిసోడియాను ఈడీ ప్రశ్నించింది. ప్రస్తుతం సిసోడియా తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Show comments