NTV Telugu Site icon

IPL 2023 Delhi Capitals: ఢిల్లీ కొత్త కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్.. వైస్ కెప్టెన్‌గా అక్సర్ పటేల్

Axar Patel And David Warner

Axar Patel And David Warner

ఐపీఎల్ – 16వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త సారథిని ప్రకటించింది. కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయంతో ఈ సీజన్‌కు దూరమైన కారణంగా కొత్త సారథిని నియమించింది. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు తమ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం ప్రకటించింది. ఈ సీజన్‌లో అక్సర్ పటేల్ ఆసీస్ డిప్యూటీగా ఎంపికయ్యాడు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ సారథిగా నియమించడం విశేషం. ఢిల్లీ ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన కూడా చేసింది. టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అతడికి డిప్యూటీగా ఉండనున్నాడు. డేవిడ్ వార్నర్ (సి), అక్షర్ పటేల్ (విసి) నాయకత్వంలో ఈ #IPL2023 బిగ్గరగా గర్జించడానికి అంతా సిద్ధంగా ఉంది అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Also Read: Bandi Sanjay: రోడ్డు మీద సెల్ఫీలు దిగుతా వారితో సంబందం ఉన్నట్టా? అఖల్ ఉండాలి అనడానికి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకూ ట్రోఫీ గెలుచుకోలేదు. 2020లో ఆ జట్టు ఫైనల్స్‌కు వెళ్లినా ట్రోఫీ మాత్రం కొట్టలేకపోయింది. ఆ సీజన్ లో శ్రేయాస్ అయ్యర్‌ ఢిల్లీని విజయవంతంగా నడిపించాడు. కానీ గాయం కారణంగా అతడు తర్వాతి 2021 సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో గత రెండేండ్లు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఢిల్లీని నడిపించాడు. అయితే గతేడాది పంత్ కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన నేపథ్యంలో ఢిల్లీకి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది.

కాగా, గతంలోనూ ఢిల్లీ డేర్ డెవిల్స్ కి వార్నర్ సారథిగా వ్యవహరించాడు. 2009 నుంచి 2013 సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడిన వార్నర్.. అప్పుడు కూడా కొన్ని మ్యాచ్ లకు తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయిలో ఢిల్లీ జట్టకు నాయకత్వం వహించనున్నాడు. టోర్నమెంట్ చివరి ఎడిషన్‌లో, వార్నర్ 150.62 స్ట్రైక్ రేట్‌తో 12 మ్యాచ్‌ల్లో క్యాపిటల్స్ తరఫున 432 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఐదు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.