NTV Telugu Site icon

Ministry of Defence: సుఖోయ్ ఇంజిన్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. 26 వేల కోట్ల ఒప్పందంపై సంతకం

Sukhoi

Sukhoi

దేశ రక్షణ శక్తి నిరంతరం బలపడుతోంది. దీంతో.. రక్షణ శాఖ రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) నుంచి సుఖోయ్-30 విమానాలకు సంబంధించిన 240 ఏఎల్-31 ఎఫ్‌పీ ఏరో ఇంజిన్‌ల కొనుగోలుకు రూ.26 వేల కోట్లతో ఒప్పందం కుదిరింది. రక్షణ మంత్రిత్వ శాఖ, హెచ్‌ఏఎల్ సీనియర్ అధికారులు సోమవారం ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అర్మానే, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పాల్గొన్నారు.

Read Also: Supreme Court: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. అందులో జోక్యం చేసుకోలేం

ఈ ఏరో ఇంజన్లు HAL యొక్క కోరాపుట్ డివిజన్‌లో తయారు చేస్తున్నారు. సుఖోయ్-30 విమానాల ఫ్లీట్ కార్యాచరణ సామర్థ్యాన్ని నిర్వహించడానికి ఇవి వైమానిక దళ అవసరాలను తీర్చగలవని అధికారులు భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం.. HAL సంవత్సరానికి 30 ఏరో ఇంజిన్లను సరఫరా చేస్తుంది. ఈ విధంగా మొత్తం 240 ఇంజన్ల సరఫరా వచ్చే 8 ఏళ్లలో పూర్తవుతుంది. తద్వారా దేశ రక్షణ బలానికి ఈ ఒప్పందం కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు.

Read Also: Indian Hockey Team: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసిన భారత హాకీ జట్టు.. జపాన్‌పై విజయం

ఈ ఇంజన్‌లు 54 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. వీటిని.. హెచ్‌ఏఎల్‌లోని కోరాపుట్ డివిజన్‌లో తయారు చేయనున్నారు. SU-30 మార్క్ 1 అనేది భారత వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన.. వ్యూహాత్మకంగా ముఖ్యమైన విమానాలలో ఒకటి. HAL ద్వారా ఈ ఏరో-ఇంజన్‌ల సరఫరా భారత వైమానిక దళం యొక్క నిర్వహణ అవసరాలను తీరుస్తుంది. దీంతో.. వారు తమ నిరంతర కార్యకలాపాలను కొనసాగించగలుగుతారు. అలాగే.. దేశ రక్షణ సంసిద్ధతను పటిష్టం చేయగలుగుతారు.

Show comments