షణ్ణూ… ఏంట్రా ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 16న షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు. యూ-ట్యూబర్, ఆర్టిస్ట్ అయిన షణ్ముఖ్ ను మిత్రులంతా షణ్ణూ అని అభిమానంగా పిల్చుకుంటారు. అతను ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపెంట్ గా ఉన్నాడు. 16వ తేదీతో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న షణ్ముఖ్ పై అతని గ్యాంగ్ కు భారీ ఆశలే ఉన్నాయి. కరెంట్ తీగలా కనిపించే షణ్ముఖ్ లో కసితో పాటు చాలా టాలెంట్ ఉందని, అతను తప్పనిసరిగా బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడని వాళ్ళంత నమ్ముతున్నారు. అంతేకాదు… నాగార్జున, చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని షణ్ముఖ్ అందుకుంటున్నట్టు మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… షణ్ముఖ్ – ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసిన దీప్తీ సునయనతో లవ్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక… నాగార్జున గుచ్చి గుచ్చి అడగడంతో బయట పెట్టాడు షణ్ముఖ్. విశేషం ఏమంటే… 16వ తేదీ రాత్రి సునయన అండ్ టీమ్ షణ్ముఖ్ కు అతని జీవితంలోనే మెమొరబుల్ గిఫ్ట్ ను అందించింది. బిగ్ బాస్ హౌస్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీదకు సునయన, ఆమె స్నేహితులంతా చేరుకుని, బిగ్ బాస్ హౌస్ సెట్లోకి వినిపించేలా… ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ గట్టిగా అరుస్తూ విషెస్ తెలిపారు. అక్కడే కేట్ కట్ చేశారు. ఆకాశంలోకి తారాజువ్వలను వదిలి, బాణసంచా కాల్చి… షణ్ముఖ్ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ హంగామాతో బిగ్ బాస్ హౌస్ లోని షణ్ముఖ్ తో పాటు మిగిలిన పార్టిసిపెంట్స్ సైతం బయటకు వచ్చి.. ఆ కోలాహలాన్ని గమనించారు. షణ్ముఖ్ కు దీప్తి సునయన సోషల్ మీడియా ద్వారానూ తన ప్రేమను తెలియచేసింది. అలానే బిగ్ బాస్ హౌస్ నుండి షణ్ముఖ్ సైతం రియాక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 5కి ముందు జరిగిన ఏ సీజన్ లోనూ ఏ కంటెస్టెంట్ కూ ఇలా బర్త్ డే విషెస్ ఎవరూ చెప్పలేదు. అది దీప్తి సునయన కారణంగా… షణ్ముఖ్ కు లభించిన రేర్ బర్త్ డే గిఫ్ట్ అనే చెప్పాలి.
Also Read
తన ప్రియురాలు, స్నేహితుల నమ్మకాన్ని నిలబెడుతూ బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ విన్ అవుతాడేమో చూడాలి… ఇదిలా ఉంటే… షణ్ముఖ్ బర్త్ డే సందర్భంగా జరుగుతున్న ఈ హంగామా అంతా చూసి, మిగిలిన హౌస్ మేట్స్ ‘షణ్ణూ… ఏంట్రా ఇది!’ అంటూ ఆటపట్టిస్తున్నారు!!



తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!