హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే దళిత బంధుపై కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ త్వరలోనే దళిత బంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. దళిత బంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని, హుజురాబాద్‌తో పాటు నాలుగు మండలాల పరిధిలో ప్రకటించిన విధంగానే దళితబంధు అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.