Site icon NTV Telugu

DalaiLama Apologises: ఆ బాలుడి కుటుంబానికి క్షమాపణలు.. విచారం వ్యక్తం చేసిన దలైలామా

Dalai Lama

Dalai Lama

తన నాలుకను నోటితో తాకాలంటూ ఓ బాలుడిని బౌద్ధ మత గురువు దలైలామా కోరడం తాజాగా తీవ్ర వివాదాస్పదమైంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దలైలామా క్షమాపణలు చెప్పారు. బౌద్ధ ఆధ్యాత్మిక గురువు బాలుడికి, అతని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. తనను కలుసుకునే వ్యక్తులను తరచుగా అమాయకంగా, ఉల్లాసభరితంగా ఆటపట్టిస్తానని చెప్పారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Also Read: KA Paul: పాపం పాల్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు

కాగా, తన వద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిన ఓ భారతీయ బాలుడిని దగ్గరకు తీసుకొని అతడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టినట్లు వీడియోలో ఉంది. అనంతరం బౌద్ధ గురువు తన నాలుకను బయటపెట్టి.. ‘నీ నోటితో నా నాలుకను తాకుతావా’ అని అడగడం వినిపించింది. దీంతో- ఆయన తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దలైలామా ఒక బౌద్ధ కార్యక్రమంలో ఒక భారతీయ కుర్రాడిని ముద్దుపెట్టుకుంటున్నాడు మరియు అతని నాలుకను తాకడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దలైలామా ఈ చిన్న పిల్లవాడిని ఎందుకు ముద్దుగా చూస్తున్నాడు మరియు అతని నాలుకను చప్పరించమని ఎందుకు అడుగుతున్నాడు? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.
Also Read:Thota Chandrasekhar: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో అందుకే పాల్గొంటున్నాం

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన దలైలామా గతంలో 2019 లో తన వారసుడు మహిళ కావాలంటే, ఆమె ఆకర్షణీయంగా ఉండాలి అని వివాదాస్పదంగా చెప్పినందుకు క్షమాపణలు చెప్పాడు. గత నెలలో, దలైలామా US-జన్మించిన ఎనిమిదేళ్ల మంగోలియన్ బాలుడిని 10వ ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచేగా పేర్కొన్నాడు, ఇది టిబెటన్ బౌద్ధమతంలో మూడవ అత్యున్నత ర్యాంక్. దలైలామా టిబెట్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని బీజింగ్ ఆరోపించింది మరియు భారతదేశం, నేపాల్, కెనడా మరియు యుఎస్‌తో సహా సుమారు 30 దేశాలలో నివసిస్తున్న సుమారు 100,000 మంది ప్రవాస టిబెటన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (CTA)ని అది గుర్తించలేదు.

Exit mobile version