సైబర్ దొంగలు.. మాజీ సైనికుడి డబ్బుల్ని వదల్లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరినీ వదలడం లేదు. మాజీ సైనికుడు క్యాన్సర్ చికిత్స కోసం దాచుకున్న డబ్బులను సైబర్ నేరస్థులు కొట్టేశారు.చెక్ బుక్ కోసం టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన తీరును క్యాష్ చేసుకున్న సైబర్ నేరస్థులు చికిత్స కోసం మూడు బ్యాంక్ ల్లో దాచుకున్న 2 లక్షల 30 వేల రూపాయలను దోచేశారు. ఇక్కడ భార్యతో సహా కనిపిస్తున్న ఈయన పెద్దబోయిన భిక్షపతి. మాజీ సైనికుడు దేశ సేవకోసం బార్డర్లో సేవలందించారు. విజయవంతంగా సేవలు చేసిన ఇటీవలనే పదవీ విరమణ చేసిన తర్వాత స్వంత ప్రాంతం అయిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఇటీవలనే క్యాన్సర్ బారినపడ్డాడు. క్యాన్సర్ శస్త్ర చికిత్సకోసం మూడు బ్యాంకు ఖాతాలో రెండు లక్షల 30 వేలు దాచుకున్నారు పెద్దబోయిన భిక్షపతి. SBI బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు, HDFC బ్యాంకు ఖాతాలో 95 వేల రూపాయలు, ఇండియన్ బ్యాంకు ఖాతాలో 35 వేల రూపాయలను దాచుకున్నాడు. మరో వారం రోజులలో శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా SBI బ్యాంకు లో చెక్ బుక్ కోసం అప్లయ్ చేయగా వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేశారు. ఆ ఫోన్ పెట్టేసిన కొద్దిసేపటికే మరో మారు SBI కాల్ సెంటర్ నుండి అంటూ భిక్షపతికి మరో ఫోన్ వచ్చింది. కాల్ సెంటర్ నుండి ఫోన్ వచ్చింది అని నమ్మిన భిక్షపతి అన్ని వివరాలు చెప్పారు . అంతే ఆయన మూడు బ్యాంక్‌లలో దాచుకున్న డబ్బులు కట్ అవుతూ మెసేజ్ వచ్చింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం

బ్యాంక్ అధికారులు అనుకుని సమాచారం ఇవ్వడం మాజీ సైనికుని కొంప ముంచింది. పొంచి ఉన్న మోసాన్ని గుర్తించలేక తన బ్యాంకు ఖాతాలో నగదును పోగొట్టుకోవాల్సి వచ్చిందని విలపించారు. వెంటనే బ్యాంకులకు వెళ్లి ఆరాతీయగా ఖాతాలో నగదు మాయమైనట్లు రూఢీ అయింది. వెంటనే బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. ఖాతాలలో డబ్బులు మాయమైన విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని మాజీ సైనికాధికారి కోరుతున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!