Site icon NTV Telugu

ఒకే వ్య‌క్తికి 5 డోసులు… ఆరో డోసుకు షెడ్యూల్‌…!!!

క‌రోనా స‌మ‌యంలో వ్యాక్సినేష‌న్‌ను ప్ర‌భుత్వం వేగ‌వంతం చేసింది.  క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ ఒక్క‌టే ప‌రిష్కారం కావ‌డంతో ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.  ఇక ఇదిలా ఉంటే, ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మేర‌ఠ్‌కు చెందిన రామ్‌పాల్ సింగ్ అనే వ్య‌క్తి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాడు.  రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక స‌ద‌రు వ్యక్తి  వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు.  కాగా, అందులో ఐదు డోసులు తీసుకున్న‌ట్టుగా ఉండ‌టంతో షాక్ అయ్యాడు.  మార్చి 16న తొలి డోసు, మే 8న రెండో డోసు, మే 15 న మూడో డోసు, సెప్టెంబ‌ర్ 15న 4, 5 డోసులు ఇచ్చిన‌ట్టుగా ఉన్న‌ది. డిసెంబ‌ర్ 2021 నుంచి జ‌న‌వ‌రి 2022 మ‌ధ్య ఆరో డోసుకు షెడ్యూల్ చేసి ఉండ‌టంతో ఆశ్చ‌ర్య‌పోయిన రామ్‌పాల్ వెంట‌నే అధికారుల‌ను సంప్ర‌దించాడు.  అధికారులు ఈ త‌ప్పుపై దర్యాప్తు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.  

Read: ఓటుతో పాటు బీరుకోసం ఓ లెట‌ర్‌… వైర‌ల్‌…

Exit mobile version