Site icon NTV Telugu

తెలంగాణలో కరోనా టెర్రర్.. లాక్ డౌనేనా?

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే వుంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కూకట్ పల్లి, బాలానగర్ లలో రోజు రోజుకు పెరుగుతున్నాయి కోవిడ్ కేసులు. యూపీహెచ్‌సీ,పీహెచ్‌సీలలో 286 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. కూకట్ పల్లి- 50,హస్మత్ పేట్ – 20, బాలానగర్ – 51, మూసాపేట – 34, జగద్గిరి గుట్ట – 55, ఎలమ్మబండ – 46, పర్వత్ నగర్ లో 30 కేసులు వెలుగు చూశాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆలయంలో పనిచేసే ఇద్దరు హోంగార్డ్స్ కు కరోనా పాజిటివ్ రావడం ఆందోళనకు కారణం అవుతోంది.

ఇదిలా వుంటే.. పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్ డౌన్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావుకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు ప్రకటించారు. స్వయానా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ మెంట్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఎప్పుడూ… రాష్ట్ర ప్రజల్ని అలెర్ట్ చేసే డీహెచ్ కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రజలకు కరోనా ముందు జాగ్రత్తలు చెప్పే డీహెచ్ శ్రీనివాస్ రావుకు స్వల్ప స్థాయి లక్షణాలు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోవడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. వైద్యాధికారులతో పాటు డీహెచ్ కూడా పలు ఆస్పత్రుల్లో పర్యటించారు. జిల్లాల్లో కూడా పర్యటనలు చేశారు. వరుసగా కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ తప్పదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

https://ntvtelugu.com/dh-srinivasa-rao-was-diagnosed-with-corona-positive/
Exit mobile version