NTV Telugu Site icon

కరోనాపై సెలవిచ్చిన నిత్యానంద.. తాను అక్కడ అడుగుపెడితేనే అంతం..!

Nithyananda

Nithyananda

కరోనా మహమ్మారిపై సెలవిచ్చారు నిత్యానంద స్వామి… భారత్‌తో పాటు అనేక దేశాలకు కునుకులేకుండా చేస్తున్న కోవిడ్‌ వైరస్‌పై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకుని.. గుట్టుచప్పుడు కాకుండా భారత్‌ను విడిచి పారిపోయిన నిత్యానంద.. కొంత కాలం ఎక్కడున్నారు కూడా ఎవ్వరికీ తెలియదు.. ఆ తర్వాత ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొనేసి.. దానికి కైలాస దేశం అని పేరు కూడా పెట్టేశారాయన.. అయితే, నిత్యానంద అక్కడున్నా.. భారత్‌లో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.. రకరకాల వేషాలు వేస్తూ, వజ్ర, వైడూర్యాలను ధరిస్తూ ఉండే ఆయన ఫొటోలు ఎప్పటికప్పుడూ దర్శనమిస్తూనే ఉంటాయి.. ఆయన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారిపోతుంటా.. తాజాగా, కోవిడ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. భారత్‌ను కరోనా మహమ్మారి ఎప్పుడు విడిచిపోతుందంటూ ఓ శిష్యుడు నిత్యానంద స్వామిజీని అడిగారట.. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. నేను భారత భూభాగంపై ఎప్పుడు అడుగు పెడతానో అప్పుడే కరోనా అంతం అవుతుందంటూ సెలవిచ్చారట.. మరి 2019లో భారత్‌ను విడిచ పారిపోయిన.. నిత్యానంత భారత భూభాగంలో అడుగుపెట్టేది ఎప్పుడో.. కోవిడ్‌ అంతం అయ్యేది ఎప్పుడో చూడాలి.