కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉన్నది. తగ్గినట్టే తగ్గి తిరిగి వివిధ వేరియంట్ల రూపంలో విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడటంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్యసంస్థ దృవీకరించింది. అయితే, కరోనా మహమ్మారి యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్నది.
Read: మహారాష్ట్రలో కొత్త రూల్స్: ఆ దేశాల నుంచి వచ్చే వారికి…
రోజువారి కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. జర్మనీలో డిసెంబర్ 1 వ తేదీన 71,887 కొత్త కేసులు నమోదవ్వగా, ఫ్రాన్స్‌లో 49,610 కేసులు, యూకేలో 48,374 కొత్త కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. శీతాకాలంలో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే.