Site icon NTV Telugu

కరోనా నుంచి కోలుకున్న వారికి మరో కొత్త ముప్పు..

క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌గ్గింద‌ని.. అంతా రిలాక్స్ అవుతోన్న స‌మ‌యంలో.. సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోంది.. మ‌ధ్య‌లో.. బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చి చేరింది.. దేశ‌వ్యాప్తంగా బ్లాక్ ఫంగ‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతుండ‌గా.. తాజాగా, బ్లాక్ ఫంగ‌స్‌ను అంటువ్యాధిగా ప‌రిగ‌ణించాలంటూ తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల‌కు లేఖ‌లు రాసింది. బ్లాక్ ఫంగస్ గురించి ప్రజలకు తెలిసే లోపే.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగ‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో దేశ ప్రజలు దిక్కు తోచని పరిస్థితిని ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో గ్యాంగ్రీన్ వ్యాధిని గుర్తించమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు మూసుకుపోవడం..దీంతో ఆ భాగానికి ప్రాణవాయువు, పోషకాల సరఫరా నిలిచిపోవడం ఈ వ్యాధి లక్షణం. గ్యాంగ్రీన్ వ్యాధిని త్వరగా గుర్తించకపోతే.. మరణం సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు గుజరాత్ లో బయటపడ్డట్లు తెలుస్తోంది.

Exit mobile version