మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 8,067 కేసులు నమోదయ్యాయి. భారీ స్థాయిలో కేసులు పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక ముంబై నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. ముంబై నగరంలో కొత్తగా 5428 కేసులు నమోదయ్యాయి. రోజువారి కేసుల్లో పెరుగుదల 47 శాతం అధికంగా ఉన్నది. కరోనా కేసులతో పాటుగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. త్వరలోనే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాను డామినెట్ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: తెలంగాణ పోలీసులపై లోక్‌సభ స్పీకర్‌కు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు
కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముంబైతో పాటుగా ఢిల్లీలోనూ భారీగా కేసులు పెరుగుతుండటంతో దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. థర్డ్ వేవ్ తొలిదశలో జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. మాస్క్ ధరించకుండే వెయ్యిరూపాయల ఫైన్ విధిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక దేశంలో ఇప్పటికటే 1300 లకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
