దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేయాలని, యువతకు బాధ్యతలు అప్పగించాలని, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎంపిక చేయాలని సీనియర్ నేతలు పలుమార్లు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలోపేతం కావాలి అంటే సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేపట్టాలి. అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయి. అదే విధంగా, రాజస్థాన్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కూడా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ విభేదాలు కొలిక్కి రావాలి అంటే తప్పనిసరిగా పార్టీలో ప్రక్షాళన జరగాలి. వీటిపై చర్చించేందుకు వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా నేతలు కోరుతున్నారు. తాజాగా సమావేశానికి సంబంధించిన తేదీని పార్టీ ఖరారు చేసింది. అక్టోబర్ 16 వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తదితర విషయాలపై చర్చించనున్నట్టు ఆ పార్టీ ఇన్‌ఛార్జ్ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తేదీ ఖరారు… దీనిపైనే చర్చ…
