కేంద్రం కీలక నిర్ణయం: సిరంజీలపై ఎగుమతులపై పరిమితులు…

దేశంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు. ఈ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసే క్ర‌మంలో కేంద్ర‌ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. వ్యాక్సినేష‌న్ కోసం వినియోగించే సిరంజీల ఎగుమ‌తుల‌పై మూడు నెల‌ల పాటు ప‌రిమితులు విధించింది. మూడు ర‌కాల సిరంజీల ఎగుమ‌తుల‌పై ప‌రిమితులు విధించింది కేంద్రం. దేశంలోని అర్హులైన అంద‌రికి వ్యాక్సిన్ అందించే క్ర‌మంలో సిరంజీల స్టాకును పెంచుకోవడం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ వ్యాక్సిన్‌లు అందించాల‌నే ల‌క్ష్యంలో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కేంద్రం తెలియ‌జేసింది. 0.5 ఎంఎల్‌/1 ఎంఎల్‌ ఆటో డిసేబుల్‌, 0.5 ఎంఎల్‌/1 ఎంఎల్‌/ 2 ఎంఎల్‌/ 3 ఎంఎల్‌ డిస్పోజబుల్‌, 1 ఎంఎల్‌/2 ఎంఎల్‌/3 ఎంఎల్‌ రీ యూజ్‌ ప్రివెన్షన్‌ సిరంజీలపై పరిమితులు కొన‌సాగుతాయ‌ని కేంద్రం తెలియ‌జేసింది. ద‌స‌రా లోగా దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్‌ను పూర్తిచేసేందుకు కేంద్రం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.

Read: స‌రికొత్త ప‌థ‌కం: త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలేస్లే నెల‌కు రూ.21 వేలు…

-Advertisement-కేంద్రం కీలక నిర్ణయం:  సిరంజీలపై ఎగుమతులపై పరిమితులు...

Related Articles

Latest Articles