Site icon NTV Telugu

ఆ ఎమ్మెల్యేని లేపేస్తే రూ.కోటి ఇస్తా.. డీల్‌ వీడియో లీక్..!

రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణమైన విషమే.. అవి కొన్నిసార్లు శృతి మించి ఇంకా ముందుకు సాగిన సందర్భాలు కూడా లేకపోలేదు.. రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నేతల మధ్య రాజకీయాల్లోనైనా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అందరూ కోరుకునే విషయం. అయితే, తాజాగా ఓ ఎమ్మెల్యే హత్యపై ఇద్దరి మధ్య కుదిరిన డీల్‌ ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది… బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ కర్ణాటక కాంగ్రెస్ నేత ఓ వ్యక్తితో డీల్‌ మాట్లాడుతున్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోయింది..

Read Also: దూసుకొస్తున్న ‘జవాద్‌’.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

ఇక, ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేత గోపాలకృష్ణ ఓ వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో ఒకటి లీక్‌ అయ్యింది.. ఆ వీడియోలో.. యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్‌ను హత్య చేయాలని డీల్‌ మాట్లాడుతున్నారు గోపాలకృష్ణ.. ఆ ఎమ్మెల్యేను ఫినిష్ చేస్తే కోటి రూపాయలు ఇస్తానని.. ఈ విషయం చాలా గోప్యంగా మన ఇద్దరి మధ్యే ఉంటుందని చెప్పుకొచ్చాడు.. అది ఎవరు రికార్డు చేశారు.. ఎప్పుడు చేశారు.. అసలు ఎందుకు చేశారు అనేది తెలియాల్సి ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. ఈ వీడియోపై స్పందించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర.. దీనిపై విచారణ జరుగుతున్నట్టు తెలిపారు.. సదరు ఎమ్మెల్యేతో కూడా మాట్లాడని.. అదనపు భద్రత విషయంపై చర్చిస్తున్నామన్నారు.. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.

Exit mobile version