వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ ప్రయత్నిస్తున్నది. అవకాశం ఉన్న ఏ అంశాన్ని కూడా వదుకుకోవడంలేదు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ప్రియాంక గాంధీ తన భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. రైతుల నిరసలకు మద్ధతు తెలపడమే కాకుండా వారితో కలిసి పోరాటం చేశారు. లఖింపూర్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించిన తీరు, పోరాటం చేసిన విధానం ఆ పార్టీకి కొంతమేర కలిసివస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో మహిళలను ఆకట్టుకోవడానికి పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ తెలిపారు. వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా బీజేపీ, కాంగ్రెస్, యూపీ మధ్య త్రిముఖపోటీ ఉండే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముందస్తు సర్వేలు బీజేపీకి అవకాశం ఉన్నట్టు చెప్పినా, లఖింపూర్ ఘటనల తరువాత ఫలితాలు మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆ ముగ్గురిదే కీలక పాత్ర… కానీ చివరకు…
