కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు రాష్ట్రపతిని కలిశారు. లఖింపూర్ ఘటనపై రాష్ట్రపతికి కంప్లైంట్ చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని బృందం ఈరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. ఘటనపై స్వతంత్ర బృందంచేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కోరారు. అంతేకాకుండా, కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ బృందం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి పత్రం అందజేసిన తరువాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖింపూర్ ఘటనలో తమవి రెండే రెండు డిమాండ్లు ఉన్నాయని, ఒకటి సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి, రెండోది కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రా పదవికి రాజీనామా చేయాలి లేదా ఆయన్ను తొలగించాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మిశ్రా పదవిలో ఉన్నతంత వరకు రైతులకు న్యాయం జరగదని, ఆయన రైతులను బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చిస్తామని రాష్ట్రపతి హామీ ఇచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు.
కాంగ్రెస్ పట్టు: కేంద్ర మంత్రిని తొలగించాల్సిందే…
