అర్ధరాత్రి పీఎస్‌కు సీఎం.. హడలిపోయిన పోలీసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినూత్న నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దూసుకెళ్తున్నారు.. ఇప్పటికే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. నెటిజన్లు ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నారు.. మరో వైపు.. అసెంబ్లీలో తనను పొడిగేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలకు కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం చర్చగా మారింది. ఇక, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో అడుగుపెట్టారు సీఎం స్టాలిన్.. నిన్న ఆర్ధరాత్రి సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్… అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు.. దీంతో.. పోలీసులంతా హడలిపోయారు.
అధ్యామాన్‌కోటై పీఎస్‌ను ఎప్పుడు నిర్మించారు.. ఎప్పుడు ప్రారంభించారు లాంటి వివరాలను తెలుసుకున్న సీఎం.. ఆ తర్వాత పీఎస్‌లోకి వెళ్లి ఎస్సై సీటులో కూర్చున్నారు.. పీఎస్‌లో నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.. ఇక, ఆ కేసులు ఎక్కడ వరకూ వచ్చాయి అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేసి, స్వీకరించిన పిటిషన్లు మరియు తీసుకున్న చర్యల గురించి పోలీసు సిబ్బందితో సంభాషించారు. ఉంగల్ తోకుతియిల్ మొదలైమైచర్ పథకం కింద వచ్చిన పిటిషన్లపై తీసుకున్న చర్యల గురించి ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ఇక, పోలీసు సిబ్బంది బాగోగుల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా దాదాపు 15 నిమిషాలకు పైగా పీఎస్‌లో గడిపారు సీఎం స్టాలిన్. అయితే, ఇప్పుడా వీడియోలు, ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!