NTV Telugu Site icon

గాంధీలో సీఎం కేసీఆర్ పర్యటన… రోగులకు ధైర్యం చెప్పిన సీఎం 

సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.  గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాల గురించి, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  గాంధీ ఆసుపత్రుల్లోని కొన్ని వార్డులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.  కరోనా రోగులకు ఆయన ధైర్యం చెప్పారు. కరోనా నుంచి తప్పక కోలుకుంటారని వారికి భరోసా ఇచ్చారు.  సీఎం వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ లు ఉన్నారు.  కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.