పర్యావరణ పరంగా తీవ్ర వత్తిడులు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, విపరీతమయిన చలి.. వీటికితోడు మండే ఎండలు. ఆరోగ్యంపై, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో సూరీడు తన ప్రతాపం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్ ప్రకారం ఈ వేసవిలో ఉత్తర కోస్తా ఎండలతో అదిరిపోవడం ఖాయం అంటున్నారు. రాయలసీమతోపాటు మిగిలిన కోస్తా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే.. ఈ…
రేపు జరుగనున్న ‘దళితబంధు పథకం’ ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ వేదిక ముస్తాబైంది. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో వేదికను తయారుచేశారు. వేదికపైకి 15 దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలతో పాటుగా పలువురు ఎంపీలు, మంత్రులు కూర్చోనున్నారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో ఈ సభ జరుగనుంది. ఇక త్వరలోనే హుజూరాబాద్…
సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాల గురించి, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రుల్లోని కొన్ని వార్డులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కరోనా రోగులకు ఆయన ధైర్యం చెప్పారు. కరోనా నుంచి తప్పక కోలుకుంటారని వారికి భరోసా ఇచ్చారు. సీఎం వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ లు ఉన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్…
తెలంగాణలో ఈరోజు నుంచి లాక్‌డౌన్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కు కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల కార్మికులకు ఇబ్బంది ఉండదని, ఆయా కంపెనీల ఐడీ కార్డులను చూపిస్తే అనుమతి ఇస్తామని డీజీపి మహెందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని డిజీపీ తెలిపారు. ప్రజలు అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడోద్దని,…