సీఎం కేసీఆర్ తొలిసారిగా హైదరాబాద్ లోకి గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ను తప్పించిన తరువాత ఆ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దనే ఉండటంతో కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
గాంధీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్… ఎందుకంటే…
