భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలో కూడా మునుపెన్నడూ చూడనటువంటి వరదలు తలెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాలపై ఇప్పటికే ఆరా తీసిన సీఎం జగన్ ఈనెల 2న స్వయంగా తానే జనం దగ్గరకు వెళ్లనున్నారు. నేరుగా వరద బాధితులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇప్పటికే పంట, ప్రాణ నష్టం పై వివరాలను జగన్ తీసుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 2న జనం వద్దకు జగన్..
