బద్వేల్ ఉప ఎన్నిక.. జగన్ స్ట్రాటజీ అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2019 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఏపీలో అధికార పార్టీ వైసీపీ దూకుడు మీద వుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు జరిగినా.. అక్కడ ఫ్యాన్ గాలి హవా కొనసాగుతూనే వుంది. తాజాగా సీఎం స్వంత జిల్లా కడపలోని బద్వేల్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.
నవంబర్ 2వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. బద్వేల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు పోటీలో లేవు. కానీ, బీజేపీ, ఇండిపెండెంట్లు, మరో పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్ధుల్ని బరిలో నిలిపింది. ఎలాగైనా తమ సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్‌లు ముందుకెళుతున్నాయి. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఆయా పార్టీల ప్రభావం అంతగా ఉండదని తేలిపోయింది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
గెలుపు పక్కా అని తెలిసినా.. మెజారిటీ గురించే వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. సీఎం స్వంత జిల్లా కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పక్కనే వున్న చిత్తూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరుండి మరీ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లను వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. అక్కడ మాత్రం హడావిడి కొనసాగుతోంది. వైసీపీ, కాంగ్రెస్, బీజేపీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి.. మూడు పార్టీల నేతలు అక్కడే మకాం వేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రచారంపై క్లారిటీ వచ్చింది. బద్వేల్ రాలేకపోతున్నానని.. వైసీపీ అభ్యర్థి సుధకు ఓటు వేయాలని ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ లేఖ పంపారు.
కరోనా పరిస్థితులు, ఎన్నికల సంఘం నిబంధనలతో తాను బద్వేల్ రాలేకపోతున్నానని భారీ మెజారిటీతో వైసీపీని గెలిపించాలని కోరారు. బద్వేల్ నియోజకవర్గంలోని అక్కచెల్లెమ్మలకు, అన్మదమ్ములకు ఆత్మీయ లేఖ రాశారు. ఉప ఎన్నిక సందర్భంగా తన కుటుంబ సభ్యులైన ఓటర్లతో బద్వేల్ వచ్చి గడపాలని.. ప్రత్యక్షంగా బహిరంగ సభ ద్వారా ఓట్లు అడగాలని భావించాను అన్నారు.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాలేకపోతున్నానని.. అక్కడికి వచ్చి ఓటు అడగలేకపోతున్నానని లేఖలో ప్రస్తావించారు. తాను అక్కడికి వస్తే.. భారీగా జనాలు ఒక్కసారిగా గుమిగూడితే వారిలో ఏ కొందరికైనా కొవిడ్ వచ్చే ప్రమాదం ఉందని జగన్ అన్నారు. అందరి ఆరోగ్యాలను, ప్రాణాలను, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని తన పర్యటనను రద్దు చేసుకుంటున్నా అన్నారు జగన్.
ఈ పరిస్థితుల్లో తన భావాలను ప్రత్యక్షంగా పంచుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను అన్నారు. లేఖలో నవరత్న పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరిందో కుటుంబాల వారీగా వివరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలుగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు.
సీఎం వైఎస్ జగన్ రాసిన ఈ లేఖను ముద్రించి స్థానిక నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు పేరు పేరున స్వయంగా అందిస్తున్నారు. ప్రచార సమయం ముగింపు దశకు చేరుకోనుండడంతో వైసీపీ నేతలు వేగం పెంచారు. గతంలోనూ తిరుపతిలో లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొనలేదు. ఓటర్లకు లేఖలు రాశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడ భారీ మెజారిటీ వైసీపీ స్వంత మయింది.
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి భారీ విజయాన్ని నమోదు చేశారు. 2లక్షల 70వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2019లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధించిన 2లక్షల 28 వేల ఓట్ల మెజార్టీని అధిగమించి గురుమూర్తి ఘన విజయం సాధించారు. బద్వేల్లోనూ భారీ మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది. జగన్ రాకపోయినా భారీ మెజారిటీ సాధిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద బద్వేల్ దంగల్‌లో విపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!