Site icon NTV Telugu

CM Jagan: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం… ప్రధానితో భేటీ కానున్న జగన్..

Modi And Jagan

Modi And Jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీకానున్నారు. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. సీఎం వైఎస్ జగన్ ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:AP-TS MLC Election: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌..

రాష్ట్ర సమస్యలు,పెండింగ్ బకాయిలు తదితరాలు సీఎం జగన్ .. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని సమాచారం. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను వారికీ జగన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. జూలైలో విశాఖ నుంచి పాలన చేస్తామని ఇప్పటికే కేబినెట్ భేటీలో మంత్రులకు స్పష్టత ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు కూడా అయింది. కేంద్రపెద్దలతో రాజధానికి సంబంధించిన అంశం కూడా చర్చకు రావొచ్చని ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి పాలనపై కేంద్ర పెద్దలకు సీఎం జగన్ సమాచారం ఇవ్వబోతున్నట్లు చర్చ జరుగుతోంది.
Also Read:Shaktikanta Das: ఆర్బీఐ గవర్నర్‌ కు అరుదైన గౌరవం

మరోవైపు ఢిల్లీలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ కేబినెట్ కు చెందిన మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ ని కూడా అరెస్ట్ చేశారు. చెల్లికి తోడు మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ పర్యటనకు రావడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

Exit mobile version