NTV Telugu Site icon

సమాజం చొరవ చూపాలి… రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై చిరు ట్వీట్

Chiranjeevi

సైదాబాద్, సింగరేణి కాలనీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారం చేసిన ఆ కౄరుడిని వదలొద్దు అంటూ సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. విషయం పెద్దది అవ్వడంతో పోలీసులు సైతం కేసును సీరియస్ గా తీసుకుని రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల బహుమానం అంటూ వాంటెడ్ నోట్ రిలీజ్ చేశారు. పైగా భారీ పోలీస్ బలగాలతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈరోజు పోలిసుల శ్రమను తగ్గిస్తూ రాజు మృతదేహం లభ్యం అయ్యింది. ఘటన జరిగినప్పటి నుంచీ తప్పించుకు తిరుగుతున్న నిందితుడు స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్ పై చనిపోయి కనిపించాడు. చేతిపై మౌనిక అని పచ్చబొట్టు ఉండడంతో అతడిని రాజుగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. అతను చనిపోయినట్టు వార్తలు రావడం చూసి చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : చిన్నారిపై అత్యాచారం.. హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

తాజాగా చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. “అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనను తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో పాటు కొంతమందికి ఊరటను కలిగిస్తోంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం స్పందించిన తీరు గొప్పగా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమానికి ఎవరు చేపట్టినా వారికి నా సపోర్ట్ ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి” అంటూ చిరు ట్వీట్ చేశారు.