సమాజం చొరవ చూపాలి… రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై చిరు ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైదాబాద్, సింగరేణి కాలనీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారం చేసిన ఆ కౄరుడిని వదలొద్దు అంటూ సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. విషయం పెద్దది అవ్వడంతో పోలీసులు సైతం కేసును సీరియస్ గా తీసుకుని రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల బహుమానం అంటూ వాంటెడ్ నోట్ రిలీజ్ చేశారు. పైగా భారీ పోలీస్ బలగాలతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈరోజు పోలిసుల శ్రమను తగ్గిస్తూ రాజు మృతదేహం లభ్యం అయ్యింది. ఘటన జరిగినప్పటి నుంచీ తప్పించుకు తిరుగుతున్న నిందితుడు స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్ పై చనిపోయి కనిపించాడు. చేతిపై మౌనిక అని పచ్చబొట్టు ఉండడంతో అతడిని రాజుగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. అతను చనిపోయినట్టు వార్తలు రావడం చూసి చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : చిన్నారిపై అత్యాచారం.. హత్య కేసు నిందితుడు ఆత్మహత్య
Also Read
తాజాగా చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. “అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనను తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో పాటు కొంతమందికి ఊరటను కలిగిస్తోంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం స్పందించిన తీరు గొప్పగా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమానికి ఎవరు చేపట్టినా వారికి నా సపోర్ట్ ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి” అంటూ చిరు ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!