Site icon NTV Telugu

ప్ర‌పంచం కొత్త వేరియంట్‌తో భ‌య‌ప‌డుతుంటే… చైనా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతోంది…

ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు కొత్త వేరియంట్‌తో భ‌య‌ప‌డుతున్న‌ది. ఎటు నుంచి దేశంలోకి ప్ర‌వేశిస్తుందో తెలియ‌క ఆందోళ‌న‌లు చెందుతున్నారు.  ఈ వేరియంట్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  కొన్ని దేశాలు అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌పై నిషేదం విధిస్తే, ఇజ్రాయిల్ వంటి దేశాలు స‌రిహ‌ద్దులు మూసివేశాయి. ప్ర‌పంచ దేశాలు ఇలాంటి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంటే, చైనా మాత్రం త‌న‌కేమి తెలియ‌దు అన్న‌ట్టుగా బ‌లప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న‌ది.  

Read: బ్రేకింగ్ : ఒమిక్రాన్‌పై సబ్ కమిటీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎలాగైనా తైవాన్‌ను త‌మ దేశంలో అంత‌ర్భాగం చేసుకోవాల‌ని చూస్తోంది చైనా.  చైనాకు చెందిన 27 యుద్ద‌విమానాలు తైవాన్ బ‌ఫ‌ర్ జోన్‌లోకి ప్ర‌వేశించిన‌ట్టు ఆ దేశ అధికారులు చెబుతున్నారు.  గ‌త నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో సుమారు 150 చైనా యుద్ధ విమానాలు తైవాన్ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  తైవాన్ త‌మ దేశంలో అంత‌ర్భాగ‌మ‌ని, అవ‌స‌ర‌మైతే సైనిక చ‌ర్య‌తో ఆ దేశాన్ని త‌మ భూభాగంలో క‌లిపేసుకుంటామ‌ని చైనా హెచ్చిర‌స్తూనే ఉన్న‌ది.  

Exit mobile version