చైనా మరోసారి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఓ సరికోత్త హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి భూకక్ష్యకు దిగువున భూమి మొత్తాన్ని చుట్టేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అయితే, చైనా ప్రయోగించిన ఈ క్షిపణి కొద్దిలో గురితప్పినప్పటికీ, అమెరికా కన్నుగప్పి ఈ క్షిపణిని ప్రయోగించింది. భూకక్ష్యకు దిగువున భూమి మొత్తం చుట్టేసి రావడం అంటే మాములు విషయం కాదు. ఈ హైపర్ సోనిక్ క్షిపణి అమెరికా మీద నుంచి కూడా ప్రయాణం చేసి ఉండవచ్చు. ఈ హైపర్‌సోనిక్ క్షిపణీ వ్యవస్థ విజయవంతం కావడంతో గత కొన్ని రోజులుగా చైనా దూకుడును ప్రదర్శిస్తోంది. దీనికి కారణం కూడా ఇదే అని అంటున్నారు. ఇలాంటి క్షిపణులు ధ్వనివేగం కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణం చేస్తాయి. అంటే గంటకు సుమారు 6200 కిమీ వేగంతో ఈ క్షిపణులు ప్రయాణం చేస్తాయి. బాలిస్టిక్ క్షిపణులను ఒకసారి ప్రయోగిస్తే వాటిని మధ్యలో నియంత్రించడం కుదరదు. కానీ, ఈ హైపర్ సోనిక్ క్షిపణులను మధ్యలో నియంత్రించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థలు రష్యా, చైనా, అమెరికా, ఉత్తర కోరియా దేశాల వద్ధ మాత్రమే ఉన్నది. ఇండియా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ ప్రస్తుతం వీటిపై పరిశోధనలు చేస్తున్నాయి. ఇక రష్యా తయారు చేసిన హైపర్‌సోనిక్ క్షిపణి ధ్వని వేగం కన్నా 27 రెట్ల వేగంతో ప్రయాణం చేయగలదు. ప్రపంచంలోనే అత్యంత వేగంతో దూసుకెళ్లే క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్. ఇది భారత్ వద్ద ఉన్నది. ఈ క్షిపణి కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళ్లే హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని రాబోయే నాలుగైదేళ్లలో తయారు చేస్తామని ఇండియా చెబుతున్నది.
అమెరికాకు షాక్ ఇచ్చిన చైనా … రహస్యంగా…
