తిరుపతికి చేరుకున్న మంచు విష్ణు, మంచు లక్ష్మీ

మా అధ్యక్షుడు మంచు విష్ణు మరియు మంచు లక్ష్మీ తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట ఎయిర్ పోర్ట్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు ఆయన అభిమానులు. వీరు ఇవాళ శ్రీవారిని దర్శంచుకోనున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ… నూతన “మా” భవానానికి 3 నెలలోగా స్పష్టత ఇస్తానని చెప్పారు. విష్ణు గెలవాలని ఆంధ్ర,తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేశారని.. విష్ణు గెలుపును కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు మంచు లక్ష్మి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోలేదని.. ఎడమొహం పెడమొహంగా ఉన్నారని టీవీలలో కనిపించిందని చెప్పిన మంచు లక్ష్మి… పవన్ కళ్యాణ్, విష్ణు చాలాసేపు మాట్లాడుకున్నారని వివరించారు. కావాలనే సోషల్ మీడియాలో ఏదో ఏదో రాస్తున్నారని.. మేమంతా కలిసి ఉన్నట్లేనని వెల్లండిచారు మంచు లక్ష్మి.

Related Articles

Latest Articles