Site icon NTV Telugu

ఆ కారిడార్‌పై చైనా క‌న్ను… అదే జ‌రిగితే…

ఇండియా చైనా బోర్డ‌ర్‌లో చైనా ర‌డ‌గ సృష్టిస్తూనే ఉన్న‌ది.  స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో నిత్యం వివాదాలు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న‌ది.  ప్ర‌శాంతంగా ఉన్న స‌రిహ‌ద్దుప్రాంతాల్లో కూడా చైనా ఆగ‌డాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అరుణాచ‌ల్ స‌రిహ‌ద్దుల్లో ఇప్ప‌టికే వంద ఇళ్ల‌తో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది.  అక్క‌డికి చేరుకునేందుకు అధునాత రోడ్డు, ఎల‌క్ట్రిసిటీ సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేసింది.  చైనా చేస్తున్న ప‌నుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌ని ఇండియన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు.  

Read: ఇలా చేస్తే… ఇంట‌ర్నెట్ లేకున్నా వాట్సాప్ ప‌నిచేస్తుంది…

ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు చైనా క‌న్ను సిలిగురి కారిడార్‌పై ప‌డింది.  ఈ మార్గం నుంచి ఈశాన్య‌భార‌త‌దేశంలోని 8 రాష్ట్రాల‌కు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి.  ఈ చికెన్ నెక్ ప్రాంతం చాలా సున్నిత‌మైన‌ది.  కొన్ని చోట్ల ఈ ప్రాంతం కేవ‌లం 22 కిలోమీట‌ర్ల వెడ‌ల్పు మాత్ర‌మే ఉన్న‌ది.  ఈ ప్రాంతం భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌కు స‌మీపంలో ఉన్న‌ది.  అదేవిధంగా చైనాలోని చుంభీలోయ ప్రాంతం ఈ చికెన్‌నెక్ కారిడార్‌కు స‌మీపంలో ఉన్న‌ది.  చుంభీలోయ ప్రాంతంలో సైనిక స్థావరాల‌ను చైనా బ‌లోపేతం చేస్తున్న‌ది.  ఇటీవ‌లే ఈ ప్రాంతంలో 400 మంది సైనికుల‌ను రిక్రూట్ చేసుకున్న‌ది.  వారికి ఆప్రాంతంలోనే ట్రైనింగ్ ఇవ్వ‌నున్నారు. చుంభీలోయ ప్రాంతం సిలిగురి కారిడార్‌కు స‌మీపంలో ఉండ‌టంతో ఈ ప్రాంతంపై ప‌ట్టుసాధిస్తే తద్వారా ఈశాన్యరాష్ట్రాల‌తో భార‌త దేశానికి సంబంధాలు దెబ్బ‌తింటాయి.  ఫ‌లితంగా ఆ ప్రాంతాల‌పై ప‌ట్టుసాధించ‌వ‌చ్చ‌ని చైనా చూస్తున్న‌ది.  

Exit mobile version