ఇప్పటి వరకు లద్దాఖ్‌లో అలజడులు సృష్టించిన చైనా కన్ను ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌పై పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదే అని చెప్పి ఎప్పటి నుంచే చైనా వాదిస్తూ వస్తున్నది. ఇండియా అందుకు ఒప్పుకోకపోవడంతో రెండు దేశాల మధ్య అరుణాచల్ ప్రదేశ్ వివాదం నడుస్తున్నది. ఇండియన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ చైనా బోర్డర్‌లో నిత్యం బలగాలు పహారా కాస్తుంటాయి. అయితే, చైనాకు చెందిన 200 మంది జవానులు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చారు. తవాంగ్‌లో ఇండియా ఏర్పాటు చేసుకున్న బంకర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే తైవాన్ గగనతలంలోకి ప్రవేశించి ఆదేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రపంచానికి చెప్పిన చైనా, ఇప్పుడు ఇండియాలోని తవాంగ్‌లోకి ప్రవేశించి మరోసారి రెండు దేశాల మధ్య రగడకు తెరతీసింది. దీనిపై భారత ప్రభుత్వం, రక్షణ శాఖ ఎలా స్పందిస్తాయో చూడాలి.
అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా బలగాలు…
