Site icon NTV Telugu

అది ఫేక్ వెబ్‌సైట్.. ‘ఆనందయ్య మందు’పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

Anandaiah

ఆనందయ్య మందు పంపిణీ చాలా గందరగోళంగా తయారైంది. Childeal.com ద్వారా ఆనందయ్య ఆయుర్వేదం మందును పంపిణీ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక వెబ్‌సైట్ ఏదీ లేదని తేల్చిచెప్పింది ఫ్యాక్ట్ చెక్ టీమ్. ఇప్పటి వరకు ఏ వెబ్‌సైట్‌కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని క్లారిటీ ఇచ్చింది ఫ్యాక్ట్ చెక్ టీమ్. ఇది ఇలా ఉండగా ఆనందయ్య మందు పంపిణీ బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం పంపిణీ లేదని అనందయ్య అనుచరులు అంటున్నారు. అధికారుల సహాకరించడం లేదని ఆనందయ్య అనుచరులు ఆరోపణలు చేస్తున్నారు.

Exit mobile version