Site icon NTV Telugu

Chennai Airport: చెన్నై విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌.. తమిళ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణం

Chennai Airport

Chennai Airport

చెన్నై విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను నిర్మించారు. టెర్మినల్ భవనం తమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. 1,260 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.2,20,972 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోని కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. తమిళనాడు రాష్ట్రంలో పెరుగుతున్న విమాన ట్రాఫిక్‌ను తీర్చడానికి ఇది ఉపయోగడుతుంది.
Also Read:Minister KTR : మరోసారి సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్

ప్రయాణికులకు నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది ప్రతిబింబం అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. T-2 (ఫేజ్-1) భవనం విమానాశ్రయ ప్రయాణీకుల సామర్థ్యాన్ని సంవత్సరానికి 23 మిలియన్ల నుండి 30 మిలియన్లకు పెంచుతుంది. కొత్త టెర్మినల్ రూపకల్పనలో కోలం, దక్షిణ భారత గృహాల ప్రవేశ ద్వారం వద్ద కనిపించే రంగోలి లేదా అలంకార కళ, చీరలు, దేవాలయాలు, సహజ పరిసరాలను హైలైట్ చేసే ఇతర అంశాలు వంటి సాంప్రదాయ లక్షణాలను పొందుపరిచారు.
Also Read:Minister KTR : మరోసారి సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్

కొత్త టెర్మినల్ యొక్క ఫొటోలను ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. చెన్నై యొక్క మౌలిక సదుపాయాలకు ఇది ఒక ముఖ్యమైన అదనంగా ఉంటుందని అన్నారు. “ఇది కనెక్టివిటీని పెంచుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Exit mobile version