NTV Telugu Site icon

ఏపీ చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. వరుస దోపిడీలు

cheddi gang 1

జంటనగరాల ప్రజలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్‌ ఇప్పుడు ఏపీలో దోపిడీలకు తెగబడుతున్నారు. ఏపీలోని పులివెందుల నుంచి గుండుగొలను వరకు చెడ్డీగ్యాంగ్‌ వరుస దోపిడీలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో దొంగతనాలు చేసిని ఈ ముఠా ఇప్పడు విజయవాడలో ప్రత్యక్షమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్టినగర్‌, గుంటుపల్లిలో చెడ్డీగ్యాంగ్‌ ముఠా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఇటేవలే ఈ ముఠా పులివెందుల, తిరుపతి, ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు దోపిడీలకు పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ గ్యాంగ్‌ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చెడ్డీగ్యాంగ్‌ ఆటకట్టించేందుకు పోలీసులు పట్టణం నుంచి గ్రామాల వరకు రాత్రి వేళలో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.