NTV Telugu Site icon

అంబేద్కర్ దేశశిల్పి : చంద్రబాబు

tdp chandrababu

డా. బీఆర్‌ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని మా నాయకుడు ఎన్టీఆర్‌ స్థాపించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబేద్కర్‌ ఆశయాల కోసం ఎన్టీఆర్‌ కృషి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆంశాలు భారతదేశానికే కాకుండా చాలా దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

అంబేద్కర్‌ దేశశిల్పి అంటూ కొనియాడారు. అంతేకాకుండా రాజ్యాంగం ఎంతమంచిదైనప్పటికీ పాలించేవారు మంచివారు కాకపోత చివరికి రాజ్యాంగం కూడా తప్పుగా పరిగణలోకి వస్తుందని.. అలాగే రాజ్యాంగం ఎంత చెడ్డదైన పాలించేవారు మంచివారైతే రాజ్యాంగం కూడా మంచిగా కనిపిస్తుందని.. అంబేద్కర్‌ గతంలో ఈ విషయాన్ని చెప్పరంటూ చంద్రబాబు వెల్లడించారు. 2016లో అంబేద్కర్‌ 125 జయంతిని పురస్కరించుకొని నవ్యాంధ్రప్రదేశ్‌లో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రాహానికి జీవో తీసుకువచ్చామని.. కానీ ఇప్పుడు అతీగతీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.