ముందస్తు ఎన్నికలకు మేం రెడీ…. చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? వస్తే పార్టీలన్నీ రెడీగా వున్నాయా? అంటే అవుననే అంటున్నాయి. తాజాగా ఏపీలో టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబునాయుడు దీనిపై మనసులో మాట బయటపెట్టారు. మీడియాతో చిట్ చాట్ చేశారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నా అన్నారు. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరు.రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారు.
పారిశ్రామిక వేత్తలు మొదలుకుని రోజూ కూలీ వరకు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు.గతంలో భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వాళ్లు.. ఇప్పుడు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నారు.ఏసీబీ, సీఐడీలను కంట్రోల్లో పెట్టుకుని అందర్నీ బెదిరిస్తున్నారు.గౌరవానికి భంగం కలుగుతుందని భయపడి సైలెంటుగా ఉంటున్నారు.ఈ గొడవలెందుకని ఇంకొందరు వలస పోతున్నారు.ప్రభుత్వం అరాచకాలను ప్రస్తుతం ప్రజలు భరిస్తున్నారు.. ఎన్నికల్లో అన్ని తేలుస్తారన్నారు చంద్రబాబు.
Also Read
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోంది.. వస్తే సిద్దంగా ఉన్నాం.పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితం.. నేను దానిపై స్పందించను.కరోనా కారణంగా జనం రోడ్డెక్కలేదు.. దీంతో జగన్ బతికిపోయాడు.175 నియోజకవర్గాలతో సమావేశం అవుతాం.. ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం.లీడర్ల పని చేయకుంటే మారిపోతారు.పార్టీ ఎవరి కోసం త్యాగాలు చేయదు.పని చేయని ఇన్చార్ఝులను పక్కన పెట్టేస్తాం అని ఖరాఖండీగా చెప్పారు చంద్రబాబు.
ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.దిగుబడులు తగ్గాయి.. పంటల పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది.ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రంలో దిగుబడుల్లో వెనకపడింది.మిర్చి పంట పూర్తిగా నష్టపోయింది.టీడీపీ హయాంలో బిందు సేద్యం 90 శాతం సబ్సిడీ మీద ఇచ్చాం.. ఇప్పుడు అస్సలు ఆ ప్రస్తావనే లేదు.ట్రాక్టర్లు.. వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో టీడీపీ ఎంతో చేసింది. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యం.టీడీపీ చేసిన అభివృద్ధి కంటే జగన్ ఏదో చేస్తాడని ప్రజలు భావించారు.. ఇప్పుడు ఆ భ్రమలు తొలుగుతున్నాయి.ఇకపై మరింత విస్తృతంగా పోరాటాలు చేస్తాం అన్నారు చంద్రబాబునాయుడు.
తాజావార్తలు
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?