NTV Telugu Site icon

ఎవడబ్బ సొమ్మని 10 వేలు కట్టమని అడుగుతున్నారు : చంద్రబాబు

కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. దేవరాజపురంలో భారీ ఎత్తున తరలివచ్చి టీడీపీ శ్రేణులు, అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తా…కార్యకర్తలు, ప్రజలను కలుస్తానని ఆయన తెలిపారు. నేను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించే ఆలోచించానని, నిత్యావసరాలు తీవ్ర భారంగా మారిపోయాయని ఆయన అన్నారు.

పొరుగున ఉన్న రాష్ట్రంలో పెట్రో ధరలు 10 రూపాయలు తక్కువగా ఉందని, ఎవడబ్బ సొమ్మని ఓటీఎస్‌కు 10 వేలు కట్టమని అడుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు బెదిరిస్తే భయపడకండి. టీడీపీ వచ్చిన తరువాత పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నన్ను కూడా బుతులు తిట్టే పరిస్థితికి వచ్చారని, రౌడీయిజం చెయ్యడం ఒక్క నిమిషం పని. కానీ అది మన విధానం కాదని ఆయన అన్నారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నా …అందరి లెక్కలు తేల్చుతామని ఆయన వార్నింగ్‌ ఇచ్చారు.