అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టిన 45 రోజుల మహాపాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తిరుపతిలో రాజధాని రైతులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలు హజరయ్యారు. అంతేకాకుండా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు కూడా హజరయ్యారు. అయితే ఈ సభకు హజరయ్యేందుకు చంద్రబాబు కూడా తిరుపతి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శించుకొని రైతులు నిర్వహిస్తున్న మహాసభ ప్రాంగణానికి చేరుకున్నారు. చంద్రబాబు సభవద్దకు రాగానే రాజధాని రైతులు పచ్చకండువాలను ఊపుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం చంద్రబాబు సభావేదికపై వచ్చి కూర్చున్నారు. అయితే చంద్రబాబు సభపైకి రాగానే వైసీపీ ఎంపీ రఘురామరాజు ఆలింగనం చేసుకోవడం విశేషం.