Site icon NTV Telugu

Rain Alert: మరో రెండు రోజుల పాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ

Rains

Rains

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read: Janasena and BJP Alliance: జనసేన-బీజేపీ పొత్తు… సోము వీర్రాజు హాట్‌ కామెంట్లు..!
ఉత్తర తెలంగాణలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు అవకాశం ఉంది. రేపటి నుండి చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తోండగా.. మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశముంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

Also Read: Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతే.. సీఎం విశాఖకు పారిపోతున్నారు..!

ఇక 24వ తేదీ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వివరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 25, 26వ తేదీల్లో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజధాని హైదరాబాద్ లో చిరు జల్లులు పడే అవకాశముందని అంచనా వేసింది. మరోవైపు ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి పంటకు భారీగా నష్టం వాటిల్లింది.తాజాగా మరోసారి వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

Exit mobile version