Site icon NTV Telugu

అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన అయ్యర్…

భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో నిన్న ఆట ముగిసే సమయానికి 75 పరుగులతో ఉన్న భారత ఆటగాడు శ్రేయర్ అయ్యర్ ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 157 బంతుల్లో 100 పరుగులు చేసాడు అయ్యర్. అయితే ఇదే అయ్యర్ కు మొదటి టెస్ట్ మ్యాచ్ అనే విషయం తెలిసిందే. ఇక ఇలా అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా నిలిచాడు అయ్యర్. అయితే మొదటి టెస్ట్ లోనే న్యూజిలాండ్ పై శతకం బాదిన మూడో ఆటగాడిగా.. అలాగే అరంగేట్ర మ్యాచ్ లోనే 100 పరుగులు సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అయ్యర్ నిలిచాడు. ఇక ఈరోజు ఆట స్టార్ట్ అయిన తర్వాత ఒక్క వికెట్ కోల్పోయిన భారత జట్టు ప్రస్తుతం 284/5 తో నిలిచింది.

Exit mobile version