NTV Telugu Site icon

Parkash Singh Badal: పంజాబ్‌ మాజీ సీఎంకు నివాళి.. దేశం అంతటా సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం

Modi And Badal

Modi And Badal

అనారోగ్యంతో కన్నుమూసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు నివాళులర్పిస్తూ దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 26, 27 తేదీలలో భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఎడి) అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ (95) మంగళవారం కన్నుమూశారు. భటిండాలోని బాదల్ గ్రామంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రకాష్ సింగ్ బాదల్ 1970-71, 1977-80 మరియు 2007-2017 మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బాదల్‌కు భార్య సురీందర్ కౌర్ బాదల్, కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మరియు కోడలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఉన్నారు. బాదల్ మృతిపై ప్రధాని మోడీ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు.
Also Read:Rajastan police: 12,854 ప్రదేశాలపై దాడులు… 8,950 మంది నేరస్థుల అరెస్టు

మరోవైపు అకాలీదళ్ పితామహుడు ప్రకాష్ సింగ్ బాదల్‌కు నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం చండీగఢ్ చేరుకుంటారని వర్గాలు తెలిపాయి. భారత రాజకీయాల్లో ఒక గొప్ప వ్యక్తి అని మోడీ అన్నారు. మన దేశానికి గొప్పగా దోహదపడిన గొప్ప రాజనీతిజ్ఞుడు, పంజాబ్ పురోగతి కోసం అవిశ్రాంతంగా పనిచేశారని ప్రధాన మంత్రి కొనియాడారు. ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని అన్నారు. తాను బాదల్‌తో చాలా నేర్చుకున్నాను అని చెప్పారు. బాదల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ రాజకీయవేత్తకు గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.