దేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటీవల పెట్రోల్ ధరలను రూ.5 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల కాలంలో రూ.వెయ్యికి చేరింది. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పలు రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.312 రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.
Read Also: మగువలకు శుభవార్త… భారీగా తగ్గిన పసిడి ధర
ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ రూ.20 లేదా రూ.30 మాత్రమే వస్తోంది. అయితే ఈ సబ్సిడీని రూ.312కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో లింకు చేసిన వినియోగదారులకు గతంలో రూ.176 సబ్సిడీ అందేది. త్వరలో దీనిని రూ.312కి పెంచనున్నారు. గతంలో రూ.153 సబ్సిడీ అందేవారికి రూ.291 వరకు సబ్సిడీ అందనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆధార్‌తో లింకు చేయాలంటే ఇండేన్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కస్టమర్లు cx.indianoil.inని సందర్శించాలని సూచిస్తున్నారు. ఇతర గ్యాస్ కస్టమర్లు సంబంధిత బ్యాంకును సంప్రదించాలని కోరారు.
