వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలో 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. కేంద్రం అమ్మేయాలని భావిస్తున్న 13 ఎయిర్‌పోర్టుల్లో 6 పెద్దవి, 7 చిన్నవి ఉన్నాయి. పెద్ద విమానాశ్రయాల జాబితాలో అమృత్ సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉన్నాయి. చిన్న ఎయిర్‌పోర్టుల జాబితాలో సేలం (తమిళనాడు), జలగాం (ఛత్తీస్‌గఢ్), జబల్ పూర్(మధ్యప్రదేశ్), కంగ్రా (పంజాబ్), గయ (యూపీ), ఖుషీ నగర్ (యూపీ), జర్సుగూడ (ఒడిశా) ఉన్నాయి. పెద్ద విమానాశ్రయాలను చిన్న ఎయిర్‌పోర్టులతో కలిపి వేలం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Read Also: పెరుగుతున్న కరోనా కేసులు.. చైనాలో మళ్లీ లాక్‌డౌన్
ఈ మేరకు వారణాసి ఎయిర్‌పోర్టుతో కలిపి ఖుషీనగర్, గయ ఎయిర్‌పోర్టులను.. భువనేశ్వర్ ఎయిర్‌పోర్టుతో కలిపి జర్సుగూడ ఎయిర్‌పోర్టును.. అమృత్ సర్ ఎయిర్‌పోర్టుతో కలిపి కంగ్రా ఎయిర్‌పోర్టును… రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టుతో కలిపి జలగాం ఎయిర్‌పోర్టును.. ఇండోర్ ఎయిర్‌పోర్టుతో కలిపి జబల్‌పూర్ ఎయిర్‌పోర్టును… తిరుచ్చి ఎయిర్‌పోర్టుతో కలిపి సేలం ఎయిర్‌పోర్టును బిడ్డింగ్ ద్వారా విక్రయించబోతున్నట్లు ఇప్పటికే కేంద్ర పౌర విమానాయాన శాఖ ప్రకటించింది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి కానుంది. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ 50 ఏళ్ల పాటు అమల్లో ఉండనుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నష్టాల్లో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
