Site icon NTV Telugu

సామాన్యులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు

దేశంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. శుద్ధి చేసిన పామాయిల్‌పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీబీసీఐసీ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి. ట్రేడర్లు లైసెన్స్ లేకుండానే పామాయిల్ దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో ఆర్‌బీడీ పామ్ ఆయిల్, ఆర్‌బీడీ పామోలిన్ వంటి వాటిని లైనెన్స్ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని తెలిపింది.

Read Also: అదానీ చేతికి మ‌రో అతిపెద్ద ప్రాజెక్ట్‌

2022 డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులో ఉండనుంది. దీంతో సామాన్యులకు కూడా బెనిఫిట్ కలగనుంది. నవంబర్ 2020-అక్టోబర్ 2021 మధ్య కాలంలో రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంట నూనెను దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు పామాయిల్ విషయంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలు అదుపులో పెట్టడంతో పాటు.. రైతులకు చేయూత ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల 40 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది.

Exit mobile version