NTV Telugu Site icon

New Year Celebrations : న్యూ ఇయర్ వేడుకలు ఇలా జరుపుకోండి.. జీవితాంతం గుర్తుండి పోతుంది?

New Year

New Year

మరో కొన్ని గంటల్లో 2024కు వీడ్కోలు పలికి.. 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. 2024 డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలను ఎలా జరపుకోవాలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటారు. అయితే దీన్ని ఆరోగ్యకరమైన రీతిలోనూ, ఆహ్లాదంగానూ జరుపుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని పెద్దలు చెబుతున్నారు.

READ MORE: Manish Sisodia: ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆర్థిక సాయం చేయండి.. ప్రజలకు సిసోడియా విజ్ఞప్తి

ఎన్నో మధురానుభూతులు, జ్ఞాపకాలను మిగిల్చిన 2024 ముగుస్తుంది. ఈ వీడ్కోలు వేడుకలు ఇతరులకు కనువిప్పు కలగించాల కానీ… మద్యపానం, ధూమపానం చేస్తూ.. మన ఆరోగ్యమే కాదు పక్కనుండే వారిపై కూడా ప్రభావం చూపకూడదు. కాబట్టి డిసెంబర్ 31న విభిన్నంగా సంబరాలు జరుపుకోండి..31న అర్ధరాత్రి సమయంలో మన శరీరానికి అనువైన యోగాసనాలు వేయండి. ఇలా చేయడం వల్ల కొత్త ఏడాదికి ఇది ఆరోగ్యపరమైన సూచికగా చెప్పవచ్చు. యోగాతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. లేదా మిత్రులు, సన్నిహితులతో కలిసి రన్నింగ్ పోటీలు నిర్వహించండి.

READ MORE: Tummala Nageswara Rao: రేవంత్ ప్రభుత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం..

దీనివల్ల నూతన సంవత్సరంలో సమస్యలకు దూరంగా పరిగెడుతున్నాం అనే భావన కలుగుతుంది. పరుగుతో మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాదు దీన్ని దినచర్యలోనూ భాగంగానూ చేసుకోండి. కొందరు 31లేదా 1వ తేదీన చుట్టుపక్కల ఉండే వైద్యశాలల్లో వృద్ధులకు, అంధులకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ మెడికల్ క్యాంపుల్లో వాలంటీర్‌గా పని చేయండి. ఇలా చేయడ వల్ల ఇతరులకు సహాయపడినట్టే కాదు.. కొత్త ఏడాదిలో మీ వల్ల కొందరు ప్రయోజనం కూడా పొందుతారు. మేము చెప్పిన ప్లాన్ కాకుండా.. మీ ప్లాన్ ఏమైనప్పటికీ ఒత్తిడిని మాత్రం దరిచేరకుండా చూసుకోండి. కొత్త ఏడాదిని సంతోషంగా ఆహ్వానించండి.. వాహనాలు నడిపేటప్పుడు.. వేడుకల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి.. కొత్త ఏడాది వేళ మీ కుటుంబీకుల్లో సంతోషాన్ని నింపండి.. ( ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు)

Show comments