సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. తీర్పు ఇచ్చిన సీబీఐ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఇవాళ తీర్పు వెలువరించింది… సీఎం జగన్‌కు, ఎంపీ సాయిరెడ్డికి భారీ ఊరట కలిగిస్తూ.. బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.. కాగా, సీఎం జగన్, ఎంపీ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..సీఎం హోదాలో వైఎస్ జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని.. ఏ1గా ఆయన సాక్షులను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారంటూ తన పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ రఘురామ.. మొదట సీఎం బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన ఆయన.. ఆ తర్వాత విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ మరో పిటిషన్ వేవారు.. ఆ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఇవాళ రఘురామ కృష్ణ రాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. తీర్పు వెలువరించింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!