NTV Telugu Site icon

ఈటలపై కేసు నమోదు..

భారత ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తరువాత ఏ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు తీయడానికి వీళ్లేదని ఎన్నికల అధికారులు నిబంధనలు జారీ చేశారు.

అయితే నిన్న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని తెలుపుతూ ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం పూర్తి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.